TS Police Constable Exam Postponed: పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన బోర్డు.
- ఇక పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీసు నియామక బోర్డు ఖరారు చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కానిస్టేబుల్ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు జులై 4 ఓప్రకటనలో తెలిపింది.
- ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీ జరగగా.. కానిస్టేబుల్ పరీక్షను 21 తేదీన నిర్వహిచేందుకు ప్రకటించినా కొన్ని కారణాల వల్ల 28వ తేదీని నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. హాల్ టికెట్లను 18వ తేదీన డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
- పోలీసు నియామక బోర్డు ఓవైపు దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోగా. పరీక్షల నిర్వహణలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రిలిమినరీ రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది.
- ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించగా. అదే నెల 28న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సెంటర్లు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆగస్టు మాసంలో ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తోంది. కానిస్టేబుల్ పరీక్షను 21 తేదీన నిర్వహిచేందుకు ప్రకటించినా కొన్ని కారణాల వల్ల 28వ తేదీని మార్పు చేసినట్లు అభ్యర్థులు గమనించాలని కోరింది.