టెర్రిఫిక్ స్టార్ట్ బింబిసార ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం..

0
13

Bimbisara 1st Day Collections:

  • నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ భారీ అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
  • ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాను చూసేందుకు చాలా రోజుల తరువాత థియేటర్ల వద్ద ఆడియెన్స్ సందడి కనిపించింది. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ కావడం, రెండింటికీ పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
bimbisara
  • ఇక బింబిసార చిత్ర విషయానికి వస్తే.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసార అనే రాజు పాత్రలో నటించడం.. టైమ్ ట్రావెల్ లో అతడు నేటి కాలానికి రావడం.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలను దర్శకుడు అద్భుతంగా మలిచాడు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడం.. దానికి తగ్గట్టుగా ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక కారణంగా ఈ చిత్రం తొలిరోజే టెర్రిఫిక్ స్టార్ట్ ను అందుకుంది. ఈ సినిమాకు ఎక్కడ చూసినా కలెక్షన్లు పెద్ద మొత్తంలో రావడం విశేషం. అంతేగాక, ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లతోనే సగం టార్గెట్ అందుకోవడం విశేషం.
  • కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్, బింబిసార చిత్ర ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 7.08 కోట్ల షేర్ వసూళ్లు రావడం గమనార్హం. ఇక ఈ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా టార్గెట్ ను అందుకోవడం ఖాయమని చిత్ర విశ్లేషకులు అంటున్నారు. కాగా, తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.15 కోట్లు
సీడెడ్ – 1.29 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.90 కోట్లు
ఈస్ట్ – 0.43 కోట్లు
వెస్ట్ – 0.36 కోట్లు
గుంటూరు – 0.57 కోట్లు
కృష్ణా – 0.34 కోట్లు
నెల్లూరు – 0.26 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 6.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.39
యూఎస్ఏ – 0.48 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.7.08 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here