వాట్సాప్‌‌లో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొత్త ఫీచర్ టైమ్ లిమిట్ పెరిగింది… 

0
5

WhatsApp New Feature: పాపులర్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కు కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. వీటి ద్వారా యూజర్లకు నూతన సదుపాయాలు దక్కుతున్నాయి. మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా యూజర్లందరికీ ఓ ఫీచర్‌కు అదనపు సమయాన్ని తీసుకొచ్చింది వాట్సాప్‌. అదే ‘డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ ఫీచర్‌కు టైమ్ లిమిట్ పొడిగింపు. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత.. రిసీవర్‌కు కూడా మెసేజ్‌ను డిలీట్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. తప్పుగా మెసేజ్ పంపినా, ఒకరికి పంపాల్సింది ఇంకొకరికి పంపినా ఆ సమయాల్లో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మెసేజ్ రివీస్ చేసుకున్న వారికి కూడా డిలీట్ అయ్యేలా చేయవచ్చు.

  • ఇంతవరకుడిలీట్ ఫర్ ఎవ్రీ వన్‌ కోసం ఒక గంటా 8 నిమిషాల 18 సెకన్ల టైమ్ లిమిట్ ఉండేది. ఆలోగా మాత్రమే రిసీవర్‌కు కూడా మెసేజ్‌ను డిలీట్ చేసే సదుపాయం ఉండేది. అయితే ఈ టైమ్ లిమిట్‌‌ను వాట్సాప్‌ భారీగా పెంచేసింది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్ లిమిట్ పొడిగింపును వాట్సాప్‌ కొన్ని నెలల నుంచి టెస్ట్ చేస్తోంది. ఆ తర్వాత బీటా యూజర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు క్రమంగా యూజర్లందరికీ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు ఈ టైమ్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసింది.
  • డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్ లిమిట్‌ను “2 రోజుల 12 గంటల 16 సెకన్లకు” పెంచింది వాట్సాప్‌. అంటే మెసేజ్ పంపిన రెండున్నర రోజుల్లోపు ఎప్పుడైనా రిసీవర్‌కు కూడా మీరు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చన్న మాట. ఈ గడువు పొడిగింపును సైలెంట్‌గా తీసుకొచ్చింది వాట్సాప్‌. కొంతకాలంగా బీటా టెస్టింగ్ జరుగుతున్నా.. ప్రస్తుతం అందరికీ ఈ ఫీచర్‌ను రోల్‌అవుట్ చేస్తోంది.
  • అయితే FaQ పేజ్‌లో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్‌కు సుమారు గంట లిమిట్ అని వాట్సాప్‌ ఇంకా ఉంచింది. దాన్ని ఇంకా అప్‌డేట్‌ చేయలేదు. అయితే ఇప్పటికే చాలా మంది యూజర్లకు 2 రోజుల 12 గంటల టైమ్ లిమిట్ సదుపాయం వచ్చేసింది. రెండు రోజుల పాత మెసేజ్‌లను కూడా డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ద్వారా డిలీట్ చేయగలుగుతున్నారు. మీరు కూడా ప్రయత్నించి చూడండి.
  • మరోవైపు, గ్రూప్‌లో ఏ పార్టిసిపెంట్ మేసెజ్ చేసినా దాన్ని అడ్మిన్ డిలీట్ చేయగలిగేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ వస్తే, గ్రూప్‌లోని ఏ మెంబర్ మెసేజ్ చేసినా.. దాన్ని తొలగించే అధికారం అడ్మిన్‌కు ఉంటుంది. ఈ ఫీచర్ ముందుగా బీటా యూజర్లకు వచ్చి.. ఆ తర్వాత అందరికీ వస్తుంది. మెసేజ్‌లను సెండ్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకునేలా సదుపాయాన్ని అందించే ఎడిట్ ఫీచర్‌పైనా వాట్సాప్‌ పని చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here