Crime: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసిన మహిళ..

0
8
  • పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్‭నర్ గొంతు కోసింది ఒక మహిళ. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‭లో జరిగిందీ ఘటన. కాగా, నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు సోమవారం తెలిపారు.
  • ప్రియుడిని హతమార్చి అతడి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‭లో వేసి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలి పేరు ప్రీతి శర్మ అని, నాలుగేళ్ల క్రితం తన భర్తతో విడిపోయిన ప్రీతి.. కొద్ది రోజులుగా ఫిరోజ్ అలియాస్ చ్వన్ని(23)తో సహజీవనం చేస్తోందని వారు వెల్లడించారు.
  • రోజువారి తనిఖీల్లో భాగంగా ఆదివారం రాత్రి టీలా మోడ్ పోలీసులు చెకింగ్ నిర్వహించారు. ఒక మహిళ నల్లటి ట్రాలీ బ్యాగ్‭ను తీసుకెళ్తుండడాన్ని గమనించి పరిశీలించగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది” అని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ సోమవారం తెలిపారు. అనంతరం ప్రీతిని అదుపులోకి తీసకుని విచారించగా.. ఫిరోజ్‭తో తాను సహజీవనంలో ఉన్నానని, తనను పెళ్లి చేసుకుందామని అనుకున్నట్లు వెల్లడించింది. అయితే వేరే కమ్యూనిటీ పేరుతో పెళ్లికి అతడి తల్లిదండ్రులు అంగీకరించలేదని పేర్కొంది.
  • దీంతో ఫిరోజ్‭పై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ పెళ్లికి అంగీకరించలేదట. పైగా ఆమె క్యారెక్టర్‭లెస్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆవేశంతో రేజర్‭తో గొంతు కోసినట్లు వెల్లడించింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‭లో సర్ది బయట ఎక్కడైనా పడేయాలని బయల్దేరి పోలీసులకు చిక్కినట్లు విచారణలో పేర్కొంది. ప్రీతిని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని తనిఖీల్లో పట్టుకున్నట్లు పోలీసులు తమ రికార్డుల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here