J&K: జమ్మూలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్ల వీరమరణం….

0
7
  • జమ్మూకాశ్మీర్‌లో సైనిక స్థావరంపై గురువారం తెల్లవారుఝామున ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మరణించారు. రాజౌరి జిల్లాలోని పర్గాల్ వద్ద ఉన్న కంచెను దాటి సైనిక స్థావరంవైపు ఇద్దరు తీవ్రవాదులు దూసుకొచ్చారు. ఇది గమనించిన సెంట్రీ గార్డ్ వారిపై కాల్పులు ప్రారంభించాడు.
  • ఆ తర్వాత మిగతా సైనికులు కూడా కాల్పులు ప్రారంభించారు. వెంటనే తీవ్రవాదులు కూడా కాల్పులు జరిపారు. దీంతో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇద్దరు తీవ్రవాదుల్ని సైనికులు కాల్చి చంపారు. గాయపడ్డ సైనికుల్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
  • ఈ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, అన్ని చోట్లా గాలింపులు చేపట్టారు. ఇంకా తీవ్రవాదులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here