స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలలో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా ప్రతికూలంగానే కదలాడుతున్నాయి. ఈ సమయంలో టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ స్టాక్ మాత్రం దుమ్ములేపుతోంది. ఈ స్టాక్ ఏకంగా 11 శాతానికి పైగా పెరిగింది. ఏ మాత్రం కాస్త తగ్గినా కూడా ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌లో డబ్బులు పెట్టడం మంచిది. ఎందుకంటే జూన్ క్వార్టర్లో అంచనాలకు మించిన ఫలితాలు, దాంతో పాటు టెక్నికల్ ఇండికేటర్స్ బలంగా ఉన్నాయి.
టాటా కెమికల్స్ స్టాక్ నేటి ట్రేడింగ్‌లో దుమ్ములేపుతోంది. బుధవారం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఈ స్టాక్ 11 శాతానికి పైగా పెరిగింది. వాల్యూమ్స్ పలింతలు పెరగడంతో.. బలమైన కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది. 10 రోజుల, 30 రోజుల, 50 రోజుల యావరేజ్ వాల్యూమ్స్కి మించి నేటి వాల్యూమ్స్ రికార్డవుతున్నాయి. మంగళవారం కంపెనీ ప్రకటించిన క్వార్టర్లీ ఫలితాలలో అంచనాలకు మించి కంపెనీ లాభాలను పోస్టు చేసింది. దీంతో టాటా కెమికల్స్ ఇన్వెస్టర్లలు నమ్మకం మరింత బలపడింది. కంపెనీ నికర లాభాలు 86 శాతం పెరిగి రూ.637 కోట్లుగా రికార్డయ్యాయి. రెవెన్యూ కూడా 34 శాతం ఎగిసింది. ఆపరేటింగ్ మార్జిన్లు మెరుగ్గా ఉండటంతో.. బుధవారం ఈ స్టాక్‌కు బలమైన కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ స్టాక్ తన మునపటి గరిష్ట స్థాయి రూ.1070కి దగ్గర్లో 11.44 శాతం లాభంలో రూ.1066 వద్ద ట్రేడవుతోంది. ఇది నేడు పూర్తిగా అప్‌ట్రెండ్‌లోనే ఉంది. అన్ని కీలకమైన మూవింగ్ యావరేజ్‌లకు పైన నేడు టాటా కెమికల్స్ స్టాక్ ట్రేడవుతోంది. టెక్నికల్ పారామీటర్స్ పరంగా ఈ స్టాక్ బలమైన బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోంది. 14 రోజుల డైలీ ఆర్ఎస్ఐ 82.32 వద్ద బుల్లిష్ జోన్లో ఉంది. ఇది ఈ స్టాక్ బలాన్ని సూచిస్తోంది. ఏడీఎక్స్ కూడా పెరుగుతోంది. ఇది బలమైన అప్‌ట్రెండ్‌ను ప్రదర్శిస్తోంది. ఓబీవీ కూడా పెరిగింది. ఎంఏసీడీ బుల్లిష్ సంకేతాలను ఇస్తోంది. మొత్తంగా ఈ స్టాక్ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది.
ఈ స్టాక్ ప్రస్తుతం భారీగా పెరుగుతుండటంతో.. ఏమాత్రం కాస్త తగ్గినా కూడా అది ఇన్వెస్టర్లకు మంచి ఎంట్రీ పాయింట్. ఈ స్టాక్ మంచి ట్రేడింగ్ అవకాశాలను అందిస్తోంది. భవిష్యత్‌లో ఈ స్టాక్ మరింత పెరిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ స్టాక్‌లో తదుపరి డెవలప్‌మెంట్స్‌ను ట్రాక్ చేసేందుకు దీనిపై ఒక కన్నేసి ఉంచితే మంచిది.