టీఎస్ఆర్టీసీ..వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

0
4

TSRTC స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఫ్రీ జర్నీ, ఫ్రీ హెల్త్ చెకప్.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు!

  • స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న జన్మించిన చిన్నారులకు 12 ఏళ్లు నిండేంత వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. 75 ఏళ్లు నిండిన వారు సైతం ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని సజ్జనార్ ప్రకటించారు. అంతేకాకుండా 75 ఏళ్లు దాటిన వారికి తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
  • భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15న జన్మించిన పిల్లలకు.. వారికి 12 ఏళ్లు నిండేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 75 ఏళ్లు నిండిన వారంతా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రకటించింది.
  • ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా.. రోజంతా హైదరాబాద్ నగరంలో ప్రయాణానికి ఇచ్చే టీ-24 టికెట్‌ను రూ.75కే ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. మామూలు రోజుల్లో ఈ టికెట్‌ను రూ.120కి విక్రయిస్తున్నారు. ఆగస్టు 18న టీఎస్ఆర్టీసీకి సంబంధించిన 75 ప్రాంతాల్లో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసి.. 7500 యూనిట్ల రక్తం సేకరించడం కోసం ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
  • ప్రజల్లో దేశభక్తి నింపడం కోసం.. నేటి నుంచి ఆర్టీసీకి సంబంధించిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించేలా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఆజాదీ కా అమృతోత్సవ్ ఉత్సవాల సమయంలోనే ఈ నిర్ణయం అమల్లో ఉండనున్నప్పటికీ.. ప్రజల స్పందనను బట్టి ఈ కార్యక్రమాన్ని పొడిగించే అవకాశం ఉందని సజ్జనార్ తెలిపారు.
  • ఆగస్టు 13న ఆర్టీసీ తొలి నాళ్లలో ఉపయోగించిన బస్సులతో నెక్లస్ రోడ్డులో పరేడ్ ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ సిబ్బంది అంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కానున్నారు.
  • 75 ఏళ్లు దాటిన వారికి హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here