శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

0
4
TTD News

రాష్ట్రవార్త తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపుచేశారు.ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మ వార్లకు విశేష సమర్పణ చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తామని వివరించా రు. కాగా పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here