సీఎం జగన్ కి రాఖీ కట్టిన ‘వాసిరెడ్డి పద్మ…..

0
6

తాడేపల్లి:
అన్నాచెల్లెలి బంధానికి ప్ర‌తీక అయిన రాఖీ పండుగ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రాష్ట్ర మ‌హిళా కమిషన్ చైర పర్సన్ వాసిరెడ్డి పద్మ రాఖీ కట్టి ఆత్మీయత పంచుకున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఆమె సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల విశాఖలో జరిగిన మహిళా కమిషన్ ల జాతీయ సదస్సు చర్చనీయాంశాలను సీఎం దృష్టికి తెచ్చారు. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ చట్టంతో పాటు మహిళా సాధికారతకు ఆలంబనగా నిలిచిన నవరత్నాల సంక్షేమ పధకాల పట్ల వివిధ రాష్ట్రాల చైర్ పర్సన్ లు ఆసక్తిని కనబరిచారని వాసిరెడ్డి పద్మ సీఎంకు వివరించారు.

అక్కచెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు:

పవిత్రమైన అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీపూర్ణిమ సందర్భంగా రాష్ట్రంలో యావత్ మహిళాలోకానికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరభావంతో పురుషాధిక్యత సమాజం నుంచి మహిళల సమానత్వం దిశగా అక్కచెల్లెమ్మలను అందరూ దీవించాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here