Vice President వెంకయ్యనాయుడికి నేడే ఘనంగా వీడ్కోలు పార్టీ

0
8
farewell party for Vice President Venkaiah Naidu
farewell party for Vice President Venkaiah Naidu

రాజ్యసభలో నేటి సాయంత్రం ఏర్పాటు

వెంకయ్యనాయుడికి మెమొంటో అందించనున్న ప్రధాని మోదీ

పదవీకాలం విశేషాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ

భారత ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడి పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ అయిన రాజ్యసభలో నేడు (సోమవారం) వెంకయ్యనాయుడికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక మెమొంటో ప్రదానం చేయనున్నారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీ కాలానికి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేటి రాత్రి ఫేర్ వెల్ డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యులు అందరూ హాజరుకానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here