Vizianagaram:ఆర్టీసీ బస్సు చోరీ..

0
5

 అందరూ కంగారుపడుతున్న సమయంలో ట్విస్ట్!

విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీ ఘటన కలకలంరేపింది. వంగర మండల కేంద్రంలో నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు మాయం అయ్యింది. రాజాం నుంచి వంగర ఆర్టీసీ బస్సు నైట్ హల్ట్ సర్వీస్ నడుస్తోంది. రాజాం నుంచి వంగర బస్సు వెళ్లింది.. అర్ధరాత్రివేళ బస్సును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. తీరా బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్, కండక్టర్ అవాక్కయ్యారు. వెంటనే రంగంలోకి దిగి ఆరా తీశారు.

ఉదయం మాయమైన బస్సు ఆచూకీ లభ్యం అయ్యింది. రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోలపేట దగ్గర గుర్తించామని ఆర్టీసీ డీఉం వెంకటేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బస్సును తీసుకెళ్లిన దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఆ దగ్గరలోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. బస్సును చోరీ చేయాలని తీసుకెళ్లారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఆరా తీస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సు చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here