నువ్వా నేనా..అంటున్న ఎయిర్‌టెల్‌,జియో 5జీ సేవలు!

0
6
  • దేశంలో 5జీ సేవల్ని వినియోగదారులకు అందించేందుకు విషయంలో ఎయిర్‌టెల్‌, జియో సంస‍్థల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే మిగిలిన సంస్థ కంటే ముందుగా భారత్‌లో 5జీ టెస్ట్‌లు నిర్వహించిన ఎయిర్‌టెల్‌..అదే స్పీడుతో 5జీ సర్వీసుల్ని అందించేందుకు సిద్ధమైంది.
  • జియో సైతం 5జీ సేవల్ని అందించనున్నట్లు ప్రకటించింది.
  • ఆగస్ట్‌లోనే 5జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందుకోసం టెలికాం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్‌, నోకియా, శామ్‌ సంగ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో సైతం 5జీ సేవల్ని అందుబాటులో తేవడంతో అదే టెక్నాలజీ సాయంతో హెల్త్‌ కేర్‌, ఇండస్ట్రీయల్‌ ఆటోమెషిన్‌ రంగాల్లో సైతం వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖేష్‌ అంబానీ వెల్లడించారు.
  • రిలయన్స్‌ వార్షిక ఫలితాలు విడుదల నేపథ్యంలో 5జీ సేవలపై ముఖేష్‌ అంబానీ మాట్లాడారు. రిలయన్స్‌ జియో దేశ వ్యాప్తంగా 1000 నగరాల్లో 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్‌ వర్క్‌ సేవల్ని వినియోగంలోకి తెస్తున్నట్లు చెప్పారు.
  • 5జీని ఒక్క టెలికం రంగానికి పరిమితం చేయకుండా హెల్త్‌ కేర్‌, ఇండస్ట్రీయల్‌ ఆటోమెషిన్‌ రంగాల్లో సైతం వినియోగించేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందు కోసం అన్నీ నగరాల్లో రూట్‌ లెవల్‌ నుంచి 5జీ నెట్‌ వర్క్‌ కావాల్సిన అన్నీ ఎక్విప్‌మెంట్‌ను తయారు చేస్తూ..వినియోగా దారుల అవసరాల్ని తీర్చేలా ఫీల్డ్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట‍్లు పేర్కొన్నారు.
  • ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించడమే కాకుండా, జియో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, తక్కువ నెట్‌ కనెక్టివీటీ క్లౌడ్ గేమింగ్, వీడియో డెలివరీ కోసం మల్టీ టెన్సీ, టీవీ స్ట్రీమింగ్, ఇండస్ట్రియల్ యాప్స్‌ వరకు ఇలా అన్నీ విభాగాల్లో 5జీ వినియోగం సాధ్యా సాధ్యాలను పరిశీలించనుంది.
  • గూగుల్‌తో ఒప్పందం
  • జియో తన క్లౌడ్ సొల్యూషన్‌ల కోసం గూగుల్‌తో చేతులు కలిపింది. 5జీతో పాటు 6జీ లో పరిశోధన, అంచనాను వేగవంతం చేసేలా ఫిన్‌లాండ్‌లోని ఔలు యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here