విశాఖపట్నం నుంచి వారణాసి,బెంగళూరులకు నేరుగా రైళ్లు కావాలి…

0
10
 • విశాఖపట్నం నుంచి వారణాసి, బెంగళూరులకు, నేరుగా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపాలని కోరుతూ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌కు లేఖలు రాశారు.
 • ఈ లేఖలలో
 • విశాఖ నుండి వారణాసికి రైల్వే మంత్రిని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని రైలు అడిగిన జీవీఎల్‌.
 • ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విశ్వహిందూ పరిషత్, విశాఖపట్నం నుండి తన దృష్టికి వచ్చిన దరఖాస్తులను ప్రస్తావిస్తూ, విశాఖపట్నం ప్రాంతం నుండి ప్రతి సంవత్సరం లక్షల మంది హిందూ యాత్రికులు వారణాసికి వెళతారని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ద్వారా వారణాసిలో అద్భుతమైన బాబా విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందని జీవీఎల్ రైల్వే మంత్రికి లేఖలో తెలియ చేశారు. అంతేకాక,
 • 2017లో జరిగిన ఇంటర్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్‌టీటీసీ) సమావేశంలో విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యేలా సంబల్‌పూర్-వారణాసి రైలును వెనక్కి పొడిగిస్తామని ఐదేళ్ల క్రితం చేసిన వాగ్దానాన్ని జీవీఎల్ మంత్రికి గుర్తుచేస్తూ, వాగ్దానం చేసిన రైలును భువనేశ్వర్ మార్గం ద్వారా కాకుండా ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్ – మధ్యప్రదేశ్‌లోని కట్ని మీదుగా వారణాసికి మార్చాలని మంత్రిని కోరారు. ఇది భువనేశ్వర్ మార్గం కంటే వారణాసికి చాలా దగ్గర రైలు మార్గం అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
 • పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన దాదాపు 1.5 లక్షల మంది దశాబ్దాలుగా విశాఖపట్నాన్ని తమ స్థిర నివాసంగా మార్చుకున్నారని, విశాఖపట్నం నేవల్ బేస్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరియు ఇతర పరిశ్రమలలో పని చేస్తున్న వారికి, వారణాసి కొరకు వేసే రైలు వారి స్వస్థలాలకు ప్రయాణ అవసరాలను కూడా తీర్చగలదని జీవీఎల్ పేర్కొన్నారు.
 • ఐటీ యువత కొరకు రైల్వే మంత్రిని బెంగుళూరుకు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కోరిన ఎంపీ జీవీఎల్‌.
 • వేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగరంలో ఐటీ రంగంలో పనిచేసేందుకు బెంగళూరుకు వెళ్లే వేలాది మంది యువతీయువకులు నివసిస్తున్నారని, వారి కొరకు విశాఖపట్నం నుంచి బెంగళూరుకు నేరుగా రైలును ప్రారంభించాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు రైల్వే మంత్రిని కోరారు.
 • విశాఖపట్నం ప్రాంత ప్రజల భావోద్వేగాలు మరియు మనోభావాలను తెలియపరుస్తూ మంత్రికి వ్రాసిన లేఖలో ఎంపీ జీవీఎల్‌.
 • ప్రకటిత విశాఖపట్నం రైల్వే జోన్ కార్య రూపం దాల్చడానికి సిద్దంగా ఉన్నప్పటికీ, విశాఖపట్నం నుండి వారణాసి మరియు బెంగళూరుకు కొత్తగా ప్రత్యెక రైళ్లను ప్రారంభించడం వల్ల విశాఖపట్న ప్రజల మనోభావాలు కొంతమేరకు సంతృప్తి చెందుతాయని ఎంపీ జీవీఎల్‌ అన్నారు.

దీని పై మంత్రి స్పందిస్తూ:

 • విశాఖపట్నం నుండి వారణాసికి రైలును ప్రారంభించేందుకు రైల్వే మంత్రి వెంటనే ట్రాక్ లభ్యతను తనిఖీ చేయాలని సంభందిత రైల్వే అధికారులను ఆదేశించారు మరియు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 • రైల్వే మంత్రితో సమావేశమై సమస్యలపై చర్చించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ట్రాక్ సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ స్నేహపూరిత, సున్నితమైన భావాలు కల విశాఖ ప్రజల మనోభావాలు నెరవేర్చుటకు తాను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని, కేంద్ర ప్రభుత్వములోని అన్నిరకాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ విశాఖలోని అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచే విధంగా తాను పని చేస్తానని విశాఖ ప్రజలకు హామీనిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here